ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Wednesday, August 12, 2020, 0:17 [IST]
ఇటీవల సోషల్ మీడియాలో 'బినొద్' అనే పేరు తెగ ట్రెండ్ అవుతోంది. బినోద్ పేరుతో జోక్స్, మీమ్స్ కూడా వచ్చాయి. అయితే బినోద్ అంటే ఏంటీ..? యూజరా, లేదంటే మరేదైనానా..? సోషల్ మీడియాలో.. ప్రపంచలో ఎక్కడ చీమ చీటుక్కుమన్న ఇట్టే తెలిసిపోతోంది. అయితే అందులో రకరకాల మీమ్స్, జోక్స్, ఇతరత్రా ట్రెండ్ అవుతుంటాయి. ఇటీవల బినోద్ అనే పేరు తెగ కనిపిస్తోంది. ట్వీట్టర్లో పదే పదే దర్శనం ఇస్తోంది.

ఇలా ఆవిర్బావం..
అభ్యుదయ, గౌతమి కవాలే అనే ఇద్దరు స్లేవీ పాయింట్ అనే వీడియో షేర్ చేశారు. ఇండియన్ యూ ట్యూబ్ వీడియోలు షేర్ చేసే సమయంలో బినోద్ పేరు తెరపైకి వచ్చింది. గత నెల 15వ తేదీన షేర్ చేసిన వ్యాఖ్యల్లో బినోద్ ప్రత్యేకంగా కనిపించింది. పూర్తి పేరు బినోద్ థాకూర్ కాగా.. బినోద్ థార్ అని యూ ట్యూబ్ అకౌంట్లో కనిపిస్తోంది. కానీ అందులో వీడియోలు మాత్రం ఉండవు. యూ ట్యూబ్ ఫాలో కావడం, కామెంట్లు చేయడమే పని.. కానీ బినోద్ ఇప్పుడు బ్రాండ్‌గా మారింది. తర్వాత మీమ్స్ తెగ వచ్చేశాయి. బ్రాండ్లు, కంపెనీలు, పోలీసు విభాగాలు కూడా బినోద్ పేరు పెట్టుకున్నాయి. పేటీఎం కూడా కొద్దిసేపు బినోద్‌గా ఉంచింది.

బినోద్.. బినోద్...
ప్రతీ ఒక్కరు పిలువడానికి బినోద్ అనే పేరు ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయడంతో ప్రారంభమైన బినోద్ పేరు తర్వాత తిరుగులేకుండా పోయింది. ఇకా ట్వీట్టర్లో చాలామంది బినోద్ పేరు, హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు.

కామెంట్స్..
బినోద్ పేరుకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. హిందుస్తాన్ హై కుచ్ బీ ట్రెండ్ కర్ జతా హై అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముంబై పోలీసులు అయితే డియర్ బినోద్.. మీ పేరుకు ఆన్ లైన్ పాస్ వర్డ్ లేకుండా పోయింది. దీంతో వైరలవుతోంది. ఛేంజ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు.
Sunisith అరెస్ట్, Views కోసం ఇంటర్వూ చేసిన అందరి పై చర్యలు - Police || Oneindia Telugu

సోషల్ మీడియాను వదలనీ..
కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 2 కోట్ల మందికి సోకింది. దానిని నివారించే పనిలో నిమగ్నమయ్యాం.. కానీ బినోద్ మాత్రం కాదు.. ట్విట్టర్, వాట్సాప్, మీమ్స్‌లో బినోద్ ఉన్నాడు.
English summary
full name of the man of the moment is Binod Thakur. Binod has a YouTube account named 'Binod Tharu' but with no videos.
Story first published: Wednesday, August 12, 2020, 0:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x