varalakshmi vratham:పూజా ఏలా చేయాలి, వత్ర నేపథ్యం ఏంటీ..? శ్రావణ రెండో శుక్రవారమే ఎందుకు..?

7 months ago 2
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

| Published: Friday, July 31, 2020, 9:07 [IST]

విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసమే శ్రావణం. తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల అయిన శ్రావణంలో నోములు, వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరలక్ష్మీ పేరుతో వత్రం చేయడానికి నిష్ట, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి క‌ృపా కలిగి అష్టైశ్వరం కలుగుతోంది. నేడు శ్రావణ వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజు అయినందున పూజా ఎలా చేయాలి తెలుసుకుందాం. పదండి.

మండపం ఏర్పాటు చేసి.. కలశం పెట్టి

మండపం ఏర్పాటు చేసి.. కలశం పెట్టి

ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసుకొని.. పూజగదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి.. దానిపైనా కలశం పెట్టాలి. అమ్మవారి ఫోటోను వెనకాలి పొందుపరచాలి. తొలుత గణపతి పూజతో వ్రతం ఆరంభించాలి. స్త్రోత్రాలు చదివి వినాయకునికి నమస్కరించాలి. పూజ చేసిన అక్షింతలు తలమీద వేసుకోవడంతో గణపతి పూజ ముగుస్తోంది. తర్వాత వరలక్ష్మీ పూజ ప్రారంభించాలి. నిండు మనసుతో స్త్రోత్రాలు చదవాలి.

పార్వతీదేవికి వివరించిన మహాశివుడు

పార్వతీదేవికి వివరించిన మహాశివుడు

స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారని సూత మహార్షి.. మునులకు చెప్పారు. పరమేశ్వరుడు ఒకరోజు భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి తదితరులు ఆయనను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో స్త్రీలు సర్వసౌఖ్యాలు పొందడానికి వ్రతం ఒకదానిని చెప్పాలని పరమేశ్వరుడిని పార్వతీదేవి కోరింది. స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం వరలక్ష్మీవ్రతం అని.. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం రోజు ఆచరించాలని తెలియజేశారు.

 చారుమతికి కలలో వరలక్ష్మీ..

చారుమతికి కలలో వరలక్ష్మీ..

వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పాలని పార్వతేదేవి కోరడంతో శివుడు వివరించారు. మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. అక్కడ చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె వినయ విధేయతలు గల సుగుణవతి. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి.. అత్తమామలను సేవలో తరించేంది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది.

నిండు మనస్సుతో నిష్టగా వత్రం..

నిండు మనస్సుతో నిష్టగా వత్రం..

చారుమతీ.. శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పడంతో చారుమతి సంతోషించింది. తేరుకొని చూడగా కల అని తెలియడంతో భర్త, అత్తమామలకు తెలియజేసింది. ఆమెతోపాటు పట్టణంలోని స్త్రీలు కూడా శ్రావణ శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. అక్కడ మండపం ఏర్పాటుచేసి.. అందులో బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని నిండు మనస్సుతో పూజించారు.

 ధన, కనక సిధ్ది

ధన, కనక సిధ్ది

వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. దీంతో ప్రతీ సంవత్సరం వ్రతం చేశారు. కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి అని శివుడు పార్వతిదేవికి వివరించారని సూత మహర్షి మునులకు తెలిపారు. ఇక అప్పటినుంచి మహిళలు శ్రావన మాస రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిష్టగా చేసుకుంటున్నారు. సకల సంపదలు పొందుతున్నారు.

English summary

varalakshmi vratham: sravana masam second friday devotees do varalakshmi vratam in good heart.

Story first published: Friday, July 31, 2020, 9:07 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article