ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Saturday, September 26, 2020, 17:20 [IST]
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బలసుబ్రహ్మణ్యం మరణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎస్పీ బాలు మరణంపై రియాలిటీ షో బిగ్ బాస్-4 నివాళులర్పించింది. వీకెండ్ శనివారం హోస్ట్ నాగార్జున అంజలి ఘటించారు. బాలుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ షోలో రానుంది.
సరిగమలు కన్నీళ్లు పెట్టాయి, రాగలన్నీ బాధపడ్డాయని హోస్ట్ నాగార్జున చెప్పే ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. బాలు మృతి తీరని లోటు అని నాగార్జున తెలిపారు. వి మిస్ యూ బాలు సార్ అని కూడా అన్నారు. ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని భావోద్వేగాలతో చెప్పారు. బాలు సంగీతాన్ని గంధర్వులు తప్పక ఆస్వాదిస్తుంటారని కచ్చితంగా చెప్పగలను అంటూ నాగ్ తెలిపారు.

దాచుకో స్వామి దాచుకో.. మా బాలును జాగ్రత్తగా దాచుకో అని నాగార్జున అనడంతో ప్రోమో ఎండ్ అవుతోంది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలు.. మృతి నాగార్జున ఉద్వేగానికి లోనయ్యారు. అనారోగ్యంతో నిన్న మధ్యాహ్నం బాలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. బోరుమని విలపించింది. అందులో భాగంగా.. బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి హోస్ట్ నాగార్జున కూడా అంజలి ఘటించారు. నాగార్జున చాలా సినిమాల్లో బాల సుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ఆయన చనిపోవడంతో నాగార్జున దిగ్బ్రాంతికి గురయ్యారు.
— starmaa (@StarMaa) September 26, 2020English summary
Bigg boss-4 reality show tribute to sp balu death. star maa release host nagarjuna promo.
Story first published: Saturday, September 26, 2020, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x