ARTICLE AD BOX
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Thursday, February 18, 2021, 18:20 [IST]
బెంగళూరు/బళ్లారి/బాగల్ కోటే: ఉద్యోగానికి వెళ్లిన నర్సు తిరిగి ఇంటికి చేరుకోలేదు. అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కనపడకుండా పోయిన నర్సు శవం నది సమీపంలోని వంతెన కింద చిక్కింది. అమ్మాయిపై అత్యాచారం చేసిన అదే ఆసుపత్రిలోని కామాంధుడు పోలీసులకు చిక్కిపోతామనే భయంతో ఆమెను చంపేసి శవం తీసుకెళ్లి నది సమీపంలోని వంతెన కింద విసిరేయడం, అత్యాచారం, హత్యకు గురైన యువతి దళితురాలు కావడంతో కలకం రేపింది.
Doubt: భార్య మీద అంకుల్ కు అనుమానం, అసలే మేడమ్ ది బ్యూటీ పార్లర్, కథ క్లైమాక్స్..!

నర్సు ఉద్యోగం
కర్ణాటకలోని భాగల్ కోటేకి చెందిన 22 ఏళ్ల యువతి నర్సింగ్ పూర్తి చేసింది. దళితురాలైన ఆ యువతి మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆశపడింది. భాగల్ కోటేలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ అమ్మాయి నర్సుగా ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఆ అమ్మాయి ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

మాయం అయిన అమ్మాయి
ఇంటి నుంచి ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన ఆ అమ్మాయి తరువాత ఇంటికి వెళ్లలేదు. అమ్మాయి కోసం ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మీ అమ్మాయి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అమ్మాయి కోసం బంధువులు, ఆమె స్నేహితుల ఇళ్లలో వెతికిన కుటుంబ సభ్యులు చివరికి బాగల్ కోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రేప్ చేసి చంపేశారు
కేసు నమోదు చేసిన పోలీసులు కనపడకుండా పోయిన నర్సు కోసం గాలించారు. అదే సమయంలో భాగల్ కోటే జిల్లాలోని ఘటప్రభా నది సమీపంలోని ముథొళ తాలుకాలోని అంకలగి వంతెన కింద నర్సు శవమై కనిపించింది. హత్యకు గురైయ్యింది నర్సు అని వెలుగు చూడటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ఆసుపత్రిలోనే కామాంధుడు
అత్యాచారం చేసి హత్యకు గురైన నర్సు ఆసుపత్రిలో పని చేస్తున్న హనీఫ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సు మీద చాలాకాలం నుంచి కన్ను వేసిన హనీఫ్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి బైక్ లో పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది.

పోలీసుల భయంతో హత్య
అమ్మాయి విషయం బయటకు చెబుతుందనే భయంతో హనీఫ్ ఆమెను చంపేసి శవం నది సమీపంలోని వంతెన కింద పడేశాడని పోలీసులు అన్నారు. హత్యకు గురైన యువతి దళితురాలు కావడం కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఆర్.బి. తిమ్మాపుర కర్ణాటక ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి మనవి చేశారు.
English summary
Girl: Dalit young woman Raped and thrown into a Ghataprabha river in Mudhol taluk, Bagalakot District.
Story first published: Thursday, February 18, 2021, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x