54 సంస్థల్ని అమ్మిందెవరు చంద్రం .. నీ మొసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా: సాయిరెడ్డి ఫైర్

1 week ago 2
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

bredcrumb

| Published: Friday, February 19, 2021, 15:33 [IST]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో అధికారి వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూములు విక్రయిస్తే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్మిక సంఘాల నాయకులకు చెప్పడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కి రాసిన లేఖలో కూడా పేర్కొన్నట్టుగా తెలిపారు. ఇక దీనిపై టిడిపి నేతలు వైయస్ జగన్, విజయసాయిరెడ్డి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పై డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. ఆ విషయం చెప్పి చంద్రబాబుపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది ఎవరు బాబు

లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది ఎవరు బాబు

టిడిపి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్స్, డజను సహకార చక్కెర కర్మాగారాలు, ఆల్విన్ వాచెస్, స్పిన్నింగ్ మిల్లులు , పేపర్ మిల్లులు మొత్తం 54 సంస్థలను అమ్మింది ఎవరు చంద్రం అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఇంకా వంద సంస్థలు పెకిలించాలనుకున్నావు . లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించావు అంటూ విరుచుకుపడ్డారు.

ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడట తుక్కు బాబు

ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడట తుక్కు బాబు

మీ ముసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా బాబూ ? అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో విశాఖ వచ్చి మరీ ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడట తుక్కు బాబు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను తెగ నమ్ముతూ, విదేశీ కంపెనీల మెప్పు కోసం లక్షలాది కార్మికుల పొట్ట కొట్టిన ఘనత చంద్రంది అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.

 రేపు వైసీపీ నాయకుల స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర

రేపు వైసీపీ నాయకుల స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర

అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం సీఎం వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎనిమిదిన్నర గంటలకు విశాఖలో వైఎస్ఆర్సిపి నాయకులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. జీవీఎంసీ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం నుండి మొదలై వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర కొనసాగుతుందని, ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు విజయ సాయి రెడ్డి.

English summary

Vijayasai Reddy, criticized Chandrababu and said a total of 54 companies including Nizam Sugars, a dozen co-operative sugar factories, Alvin Watches, spinning mills and paper mills sold in tdp regime, and said that he has no right to comment on jagan .

Story first published: Friday, February 19, 2021, 15:33 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article