సోనూసూద్‌కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డు

5 months ago 2
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

| Published: Tuesday, September 29, 2020, 19:03 [IST]

సోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అతని చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. యూఎన్ అవార్డు వచ్చినా.. తాను చేసిన సాయం చిన్నదేనని సోనూ సూద్ సింపుల్‌గా చెప్పేశారు. అదీ ఆయన నిరాడంబరానికి నిదర్శనం.

సమస్య వచ్చిందని చెబితే చాలు..

సమస్య వచ్చిందని చెబితే చాలు..

సోషల్ మీడియాలో తనకు ప్రాబ్లం వచ్చిందని చెబితే చాలు సోనూ సూద్ స్పందించారు. తనకు చేతనైనా సాయం చేసి.. శెభాష్ అనిపించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అన్నం పెట్టి, స్వస్థలాలకు చేర్చారు. దేశ, విదేశాల నుంచి విద్యార్థులను కూడా తీసుకొచ్చేందుకు సాయం చేశారు. అంతేకాదు ఆర్థిక సాయం లేని వారికి కూడా సర్జరీ కూడా చేయించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురికి సాయం చేశారు.

గుర్తించిన ఐక్యరాజ్యసమితి

గుర్తించిన ఐక్యరాజ్యసమితి

సోనూ సూద్ చేసిన సేవలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ భాగమైన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కార్యాచరణలో భాగంగా అవార్డు ప్రదానం చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ఓ వర్చువల్ ఈవెంట్ లో సోనూ సూద్‌కు పురస్కారం అందించారు.

నిస్వార్థంగా..

నిస్వార్థంగా..

ప్రజలకు చేయగలిగినంత సాయం చేశానని, ఏ ప్రయోజనం ఆశించకుండా సహాయక చర్యలు చేపట్టానని సోనూ సూద్ తెలిపారు. తాను చేసిన చర్యలను ఐక్యరాజ్యసమితి గుర్తించడంపై ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవం అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడం ప్రత్యేకమేనని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. అవార్డు వచ్చినా సింపుల్‌గా సోనూ సూద్ తన అభిప్రాయం చెప్పేశారు.

అవార్డు వచ్చింది వీరికే..

అవార్డు వచ్చింది వీరికే..

ఇప్పటివరకు ఈ అవార్డును ప్రముఖులను వరించింది. హాలీవుడ్ ప్రముఖులు లియొనార్డో డికాప్రియో, ఏంజెలినా జోలీ, ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను స్వీకరించారు. వారి బాటలో సోనూ సూద్ నిలిచారు.

English summary

united nations sdg special humanitarian award for actor sonu sood.

Story first published: Tuesday, September 29, 2020, 19:03 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article