విషాదం: బైక్‌పై కుప్పకూలిన సెల్ టవర్, వ్యక్తి మృతి, మరో మహిళకు తీవ్రగాయాలు

1 week ago 24
ARTICLE AD BOX

bredcrumb

| Updated: Monday, April 5, 2021, 20:59 [IST]

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిపై ఈదురుగా గాలులకు పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలి పడింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెల్ టవర్ పై పిడుగు పడటం వల్లే కూలిందని స్థానికులు చెబుతున్నారు.

ఈదురు గాలులతో టవర్ కూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బొట్టా రాజేశ్(43) అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన వెనుక కూర్చున్న రాణి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 man dead, his wife injured

మద్యం మత్తులో తండ్రి హత్య

అనంతపురం జిల్లా కూడేరు మండలం కడగళ్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కొడుకు తండ్రినే చంపాడు. ఓబన్నను ఆయన కొడుకు జయకృష్ణ మద్యం మత్తులో కొట్టి కిందకు తోయడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో పింఛను డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే తండ్రి జయకృష్ణ దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, జయకృష్ణను కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు తరచూ డబ్బుల కోసం తన తండ్రిని వేధించేవాడని గ్రామస్తులు తెలిపారు.

Read Entire Article