యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..

8 months ago 1
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

| Published: Saturday, June 20, 2020, 23:32 [IST]

యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను భారతదేశంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కరోనా వైరస్ వల్ల ఆన్ లైన్ యోగాకే పరిమితమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, యోగా గురువు రాందేవ్ బాబా సహా పలువురు ప్రముఖులు ఆన్ లైన్‌లో యోగా చేసి..జాతీకి ఉపదేశం ఇస్తున్నారు.

 6.30 గంటలకు మోడీ సందేశం..

6.30 గంటలకు మోడీ సందేశం..

2020 జూన్ 21వ తేదీన యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ అనే నినాదంతో నిర్వ‌హిస్తున్నారు. అందరూ ఇంట్లోని ఉండి యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆదివారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు సందేశం ఇస్తారని ఆయుష్ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.

శివుడు ఆద్యుడు

శివుడు ఆద్యుడు

యోగాకు ఆద్యులు పరమశివుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా అనే పదం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. యోగా అంటే కలయిక లేదా సంయోగం అని అర్థం. మానవుని శారీరక, బౌద్ధిక, ఆధ్యాత్మిక కోణాలను సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగ అని సాధువులు చెబుతుంటారు.

 యోగుల సంభాషణలు

యోగుల సంభాషణలు

ప్రాచీన గ్రంథాలన్నింటిలో యోగా ఉంటుంది. యోగుల సంభాషణల నుంచి పుట్టిందే యోగ అనే వాదనా కూడా ఉంది. పురాణాల ప్రకారం యోగా విద్యను శివుడు తన పత్ని పా ర్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడని పూర్వీకులు చెబుతుంటారు. పతంజలి యోగ సూత్రాలు ఆధ్యాత్మికత లోతులను స్పృశిస్తాయని కూడా వివరిస్తారు.

 భంగిమ

భంగిమ

సంస్కృతంలో ఆసనమనే పదానికి అర్థం భంగిమ.. ఆసనాలు ఎనభై నాలుగు ఉన్నాయి. ఏ ఆసనం ప్రత్యేకత దానికి ఉంది. ప్రతి దానికీ పేరు, చేయాల్సిన పద్ధతి ఉన్నాయి. యోగ ద్వారా వ్యక్తి ప్రశాంతత, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరిస్తున్నారు.

English summary

yoga:today international yoga day. health, energy is cause of yoga.

Story first published: Saturday, June 20, 2020, 23:32 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article