ఫేస్‌బుక్ సంచలనం: వార్తా సేవలు బంద్ -మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని నిరసిస్తూ..

1 week ago 2
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

bredcrumb

| Updated: Thursday, February 18, 2021, 17:47 [IST]

అమెరికా టెక్ దిగ్గజం, మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పేపర్లు, ఛానెళ్లు, వెబ్ సైట్ల వార్తా సేవలను పూర్తిగా బంద్ పెట్టేసింది. ఆయా మీడియా సంస్థల న్యూస్ పోస్టింగులులతోపాటు వాటిని యూజర్లు షేర్ చేసుకునే ఆప్షన్ ను కూడా ఎత్తేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ నిషేధం ఒక్క ఆస్ట్రేలియాలో మాత్రమే అమలులోకి వచ్చింది. పలు దేశాల్లో ఆయా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందనే ఆరోపణల క్రమంలో ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా నిర్ణయం కలకలం రేపుతున్నది..

సర్కారు చట్టాలపై వ్యతిరేకత..

సర్కారు చట్టాలపై వ్యతిరేకత..

ఆస్ట్రేలియాలో వార్తా సేవలను నిలిపేస్తున్నామని, అక్కడి వార్త సంస్థలు పంచుకొనే సమాచారాన్ని వినియోగదారులు చదివే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ సంస్థ గురువారం ఒక ప్రకటన చేసింది. వార్తలను పంచుకొన్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు ఫేస్‌బుక్‌ డబ్బులు చెల్లించాలనే నిబంధనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని రూపొందించిన దరిమిలా సోషల్ మీడియా దిగ్గజం ఈ రకంగా తన వ్యతిరేకతను ప్రదర్శించింది. నిజానికి ఫేస్ బుక్ తోపాటు గూగుల్ సంస్థపై కూడా వార్తల విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని రూపొందించినప్పటికీ, ఫేస్‌బుక్ హుటాహుటిన వార్తా సేవలు నిలిపేసింది. దీనిపై..

ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనం

ఫేస్‌బుక్ వల్ల మీడియాకు ఆదాయం

ఫేస్‌బుక్ వల్ల మీడియాకు ఆదాయం

ఆస్ట్రేలియాలో వార్తా సేవల నిలిపివేతకు సంబంధించిన ప్రకటనలో ఫేస్ బుక్ సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ వల్ల మీడియా సంస్థలకు లబ్ది చేకూరుతోన్నప్పుడు, తిరిగి తమనే డబ్బులు చెల్లించమనడం సబబు కాదని వాపోయింది. ‘‘మాకు రెండు ఆప్షన్లున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టానికి తలొంచి వార్తా సంస్థలకు చెల్లింపులు చేయడం, లేదా ఆస్ట్రేలియాలో వార్తా సేవలను నిలిపివేయటం. మేము రెండో దాన్ని ఎంచుకున్నాం. వార్తా సంస్థలు ఫేస్‌బుక్‌లో తమ వార్తల లింక్స్‌ను స్వచ్ఛందంగా పోస్ట్ చేస్తారు. యూజర్లు వాటిపై క్లిక్ చేసినప్పుడు సదరు న్యూస్ ఏజెన్సీలకు రిఫరల్ లాభాలు వస్తాయి. గతేడాది దాదాపు 407 ఆస్ట్రేలియన్ డాలర్ల లాభాన్ని ద్వారా న్యూస్ ఏజెన్సీలు పొందాయి' కానీ ఇప్పుడు కొత్తగా చెల్లింపులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఆస్ట్రేలియాలో వార్తా సేవలను నిలిపివేస్తున్నాం'' అని ఫేస్‌బుక్‌ సంస్థ పేర్కొంది. కాగా,

పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదే -ప్రధాని మోదీ ఫైర్ -ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆశ్చర్యం

గూగుల్ కాంప్రమైజ్.. ఫేస్‌బుక్ బ్యాన్..

గూగుల్ కాంప్రమైజ్.. ఫేస్‌బుక్ బ్యాన్..

ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మీడియా చట్టంలో ఫేస్‌బుక్‌‌తో పాటు గూగుల్‌పైనా ఇదే తరహా నిబంధనలు ఉన్నాయి. దీనిపై గూగుల్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే గూగుల్‌ కార్యకలాపాల్లో వార్తా సేవలు ప్రధాన భాగంగా ఉండడంతో న్యూస్‌ షోకేస్‌ విధానంలో వార్తలను అందించేందుకు గూగుల్‌, స్థానిక మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇప్పటికే అనేక చిన్న చిన్న సంస్థలతో పాటు కొన్ని పెద్ద వార్తా సంస్థలతోనూ గూగుల్ ఒప్పందాలు చేసుకుంది. ఫేస్ బుక్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకుండానే న్యూస్ షేరింగ్స్ ను బ్యాన్ చేసేంది. దీనిపై ఆస్ట్రేలియా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ కాంప్రమైజ్.. ఫేస్‌బుక్ బ్యాన్..

గూగుల్ కాంప్రమైజ్.. ఫేస్‌బుక్ బ్యాన్..

ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మీడియా చట్టంలో ఫేస్‌బుక్‌‌తో పాటు గూగుల్‌పైనా ఇదే తరహా నిబంధనలు ఉన్నాయి. దీనిపై గూగుల్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే గూగుల్‌ కార్యకలాపాల్లో వార్తా సేవలు ప్రధాన భాగంగా ఉండడంతో న్యూస్‌ షోకేస్‌ విధానంలో వార్తలను అందించేందుకు గూగుల్‌, స్థానిక మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇప్పటికే అనేక చిన్న చిన్న సంస్థలతో పాటు కొన్ని పెద్ద వార్తా సంస్థలతోనూ గూగుల్ ఒప్పందాలు చేసుకుంది. ఫేస్ బుక్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకుండానే న్యూస్ షేరింగ్స్ ను బ్యాన్ చేసేంది. దీనిపై ఆస్ట్రేలియా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary

Facebook has started blocking users, news organisations and other organisations in Australia from sharing news and other links on the platform. The announcement comes as Australia is set to make the new ‘media code’ as its law, which seeks to correct the bargaining imbalance between newsrooms and digital giants such as Facebook, Google. The social media giant had threatened to do this if the proposed law were passed and it has followed up on the same.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article