పూరీ జగన్నాథుడి ఆలయంలో బాలీవుడ్ నటి కంగనా: వివాదాల నుంచి రిలీఫ్

1 week ago 1
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

bredcrumb

| Published: Friday, February 19, 2021, 12:13 [IST]

భువనేశ్వర్: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. చాలాకాలం నుంచి వార్తల్లో ఉంటూ వస్తోన్నారు. సినిమాలతో కంటే వివాదాల ద్వారా ఆమె ఈ మధ్య కాలంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మినీ యుద్ధాన్ని సాగించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని పాకిస్తాన్‌తో పోల్చిన అనంతరం ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ నుంచి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ముంబైలోని తన మణికర్ణిక కార్యాలయ భవనాన్ని పాక్షికంగా నష్టపోవాల్సి వచ్చింది.

కంగనా రనౌత్‌పై బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేస్తోన్న శివసేన: ఊర్మిళా మతోండ్కర్ చేరికకు ఓకే

 Kangana Ranaut visits Lord Jagannath temple in Puri

ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించారనే కారణంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె చివరికి బోంబే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి ఊరట పొందారు. అప్పటి నుంచీ కంగనా రనౌత్ తరచూ ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వివాదాల నుంచి కాస్త రిలీఫ్‌ను ఆమె కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే- దేవాలయాలను సందర్శిస్తున్నారు.

 Kangana Ranaut visits Lord Jagannath temple in Puri

ఈ తెల్లవారు జామున ఆమె ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ ఆలయాన్ని సందర్శించారు. జగన్నాథుడిని దర్శించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముంబై నుంచి విమానంలో భువనేశ్వర్‌కు చేరుకున్న అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పూరీకి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున జగన్నాథుడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులకు కంగనాకు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

English summary

Bollywood actress Kangana Ranaut paid an early morning visit to Odisha, seeking darshan of Lord Jagannath at the famous Puri temple.

Story first published: Friday, February 19, 2021, 12:13 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article