పుట్ట మధు చుట్టూ తిరుగుతున్న లాయర్ల హత్యకేసు .. రాజకీయ కుట్రనా? సీబీఐ విచారణకు పిటీషన్

2 weeks ago 1
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

bredcrumb

| Published: Thursday, February 18, 2021, 14:07 [IST]

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల జంట హత్యల కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నేత పుట్ట మధు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్ పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు కావడంతో ఈ హత్య కేసులో పుట్టమధు ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాకుండా పుట్ట మధుకు , వామన్ రావుకు మధ్య గొడవలు కూడా ఉన్న కారణంగా హత్యల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 కుంట శ్రీను పుట్ట మధు ప్రధాన అనుచరుడు కావటంతో అనుమానం

కుంట శ్రీను పుట్ట మధు ప్రధాన అనుచరుడు కావటంతో అనుమానం

భార్యాభర్తలు అయిన ఇద్దరు న్యాయవాదుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై మీద సినీఫక్కీలో కారును వెంబడించి మరీ వామన్ రావు దంపతులను దుండగులు హతమార్చారు. అయితే వామన్ రావు దంపతుల హత్యలో ప్రధాన పాత్రధారుడు కుంట శ్రీనివాస్ మంథని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పుట్ట మధు ప్రధాన అనుచరుడు. మంథని అంబేద్కర్ సర్కిల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొన్న కుంట శ్రీనివాస్ ఆ తర్వాత ఊహించని విధంగా వామన్ రావు దంపతులను హతమార్చారు.

అక్రమాస్తుల కేసు పెట్టి పుట్టా మధుకు పదవీ గండం వచ్చేలా చేసిన వామన్ రావు

అక్రమాస్తుల కేసు పెట్టి పుట్టా మధుకు పదవీ గండం వచ్చేలా చేసిన వామన్ రావు

అయితే ఇసుక మాఫియా కు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వామన్ రావు దంపతులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆస్తులపై కూడా వామన్ రావు గతంలో కేసులు పెట్టారు. పుట్టమధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని వామన్ రావు వేసిన కేసు ఆయన పదవికి గండం తెచ్చింది . పుట్ట మధు పై ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదు చేశారు వామన్ రావు దంపతులు . ఈ క్రమంలో వామన్ రావు హత్యలో పుట్ట మధు హస్తముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వామన్ రావు దంపతుల హత్య రాజకీయ హత్యలే అని ప్రతిపక్షాల విమర్శలు

వామన్ రావు దంపతుల హత్య రాజకీయ హత్యలే అని ప్రతిపక్షాల విమర్శలు

ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన అనేక అక్రమాలు వామన్ రావు దంపతులకు తెలియడం వల్లే వారిని అత్యంత దారుణంగా హతమార్చారని ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ పార్టీకి దంపతుల హత్య కు ఎలాంటి సంబంధం లేదని టిఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు . కుంట శీను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ గా కూడా పని చేశారని, కావాలని కాంగ్రెస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. హత్యలు చేయాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని తేల్చి చెబుతున్నారు.

 సీబీఐతో కేసు విచారణ చేయించాలని హైకోర్టులో పిటీషన్

సీబీఐతో కేసు విచారణ చేయించాలని హైకోర్టులో పిటీషన్

కానీ లాయర్ దంపతుల హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు .ఈ నేపథ్యంలోనే వామన్ రావు దంపతుల హత్య పై సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హత్య కేసులో పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ హత్యకు సంబంధించి చిరంజీవి, కుమార్, దాస్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వారిని విచారిస్తున్నారు.

English summary

The name of Peddapalli ZP chairman and TRS party leader Putta Madhu is prominent in the case of the murders of High Court lawyer couple Gattu Vaman Rao and Nagmani. Kunta Srinivas, who is facing charges in the case, is a main follower of Putta Madhu, raising suspicions about Puttamadhu's involvement in the murder case. There are also allegations of political conspiracy behind the killings due to clashes between Putta Madhu and Vaman Rao.

Story first published: Thursday, February 18, 2021, 14:07 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article