పరిషత్‌ పోరులోనూ వైసీపీకి నిమ్మగడ్డ షాక్‌- నామినేషన్ల పునరుద్ధరణ‌- కీలక ఆదేశాలు

2 weeks ago 2
ARTICLE AD BOX
పరిషత్‌ పోరుకు వేగంగా ఏర్పాట్లు

పరిషత్‌ పోరుకు వేగంగా ఏర్పాట్లు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియన

పు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం గతంలో మొదలైన ప్రక్రియలో జరిగిన లోటుపాట్లపై సమీక్షకు సిద్దమయ్యారు.

ఇది పూర్తి కాగానే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ

నెల 20 తర్వాత పరిషత్‌ ఎన్నికల రీ షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఆగిన చోట నుంచే మళ్లీ

ఆగిన చోట నుంచే మళ్లీ

ఇప్పటికే ఇచ్చిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా ఆగిన చోట నుంచే

మొదలుపెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో అనుభవాలతో పాటు న్యాయ సలహా కూడా తీసుకున్న

నిమ్మగడ్డ ఆ దిశగానే అడుగులేస్తున్నారు. అదే జరిగితే గతంలో నామినేషన్ల దశలోనే అగిపోయిన పరిషత్ ఎన్నికల పోరు తిరిగి అక్కడి

నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 20 తర్వాత ఇచ్చే షెడ్యూల్‌లో ఆ మేరకు ప్రకటన రానుంది.

 బలవంతపు ఉపసంహరణలు చెల్లవు

బలవంతపు ఉపసంహరణలు చెల్లవు

మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే పరిషత్‌ పోరులోనూ బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ చెల్లదని ఎస్ఈసీ నిమ్మగడ్డ తేల్చేశారు.

దీంతో ఆ మేరకు అప్పట్లో ప్రత్యర్ధుల ఒత్తిడి మేరకు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్ధులకు మరో అవకాశం

ఇవ్వాలని నిర్ణయించారు. వీరంతా సరైన ఆధారాలతో కలెక్టర్లు, స్ధానిక ఎన్నికల అధికారులను ఆశ్రయించి బలవంతపు ఉపసంహరణలపై

ఫిర్యాదులు చేసేందుకు వీలు కల్పించారు. ఇలాంటి ఫిర్యాదులు తీసుకుని వాటి నివేదిక ఇవ్వాలని అధికారులను ఎస్‌ఈసీ ఆదేశాలు

ఇచ్చారు.

బలవంతపు ఉపసంహరణలపై రెండు రోజుల్లో కలెక్టర్ల నివేదిక

బలవంతపు ఉపసంహరణలపై రెండు రోజుల్లో కలెక్టర్ల నివేదిక

రాష్ట్రంలో గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై కలెక్టర్లు,

ఎన్నికల అధికారులు తమకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు ఎస్ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు

అభ్యర్ధుల నుంచి వెంటనే ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు పోలీసుల ఫిర్యాదులు, మీడియాలో వార్తలను

కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై విచారణ జరిపి రెండు రోజుల్లో తనకు నివేదిక పంపాలని

కలెక్టర్లు, ఎన్నికల అధికారులను నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ నివేదిక అందిన తర్వాత ఎన్నికల రీ షెడ్యూల్ ప్రకటిస్తారు.

Read Entire Article