డిప్యూటీ సీఎంతో వార్‌- వైసీపీకి పుష్పశ్రీవాణి మామ గుడ్‌బై- కోడలిపై కోపంతో

2 weeks ago 1
ARTICLE AD BOX

ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కుటుంబంలో రాజకీయాలు చిచ్చు రేగింది. కొంతకాలంగా కోడలు, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో విభేదిస్తున్న ఆమె మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఇవాళ వైసీపీకి గుడ్‌ బై చెప్పేశారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కోడలుతో విభేదిస్తున్న ఆయనకు కుమారుడు, వైసీపీ నేత శత్రుచర్ల పరీక్షిత్ రాజు కూడా అండగా నిలవకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విజయనగరం వైసీపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

 పుష్ప శ్రీవాణి కుటుంబంలో మామ వర్సెస్‌ కోడలు

పుష్ప శ్రీవాణి కుటుంబంలో మామ వర్సెస్‌ కోడలు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి, ఆమె మామగారు శత్రుచర్ల చంద్రశేఖర్‌ రాజుకు మధ్య విభేదాలు తారా స్దాయికి చేరాయి. శ్రీవాణి డిప్యూటీ సీఎం కాక ముందు నుంచే వైసీపీలో ఆధిపత్యం కోసం ఇరువురూ ప్రయత్నించేవారు. అయితే ఆమె డిప్యూటీ సీఎం అయిన తర్వాత పార్టీలో తనకూ, భర్త పరీక్షిత్‌ రాజుకు మాత్రమే ఆధిపత్యం చెలాయించే అవకాశం దక్కింది. దీంతో మామా, కోడళ్ల మధ్య వార్‌ ముదిరింది.

 కురుపాంలో అభివృద్ధే లేదన్న చంద్రశేఖర్‌ రాజు

కురుపాంలో అభివృద్ధే లేదన్న చంద్రశేఖర్‌ రాజు

డిప్యూటీ సీఎంగా ఉన్న కోడలు పుష్ప శ్రీవాణితో విభేదాలు తారా స్దాయికి చేరడంతో తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టిన మామ చంద్రశేఖర్‌ రాజు కురుపాంలో అభివృద్ధిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు అధికారంలో ఉన్నా, తన కోడలు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తలకే పెన్షన్లు ఇస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కోడలు పుష్పశ్రీవాణిపై మామ చంద్రశేఖర్‌ రాజు చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.

పుష్పశ్రీవాణికి అండగా నిలిచిన భర్త

పుష్పశ్రీవాణికి అండగా నిలిచిన భర్త

అయితే కోడలు పుష్ప శ్రీవాణిని టార్గెట్ చేస్తూ కురుపాం అభివృద్ధిపై తండ్రి చంద్రశేఖర్‌ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కుమారుడు పరీక్షిత్‌ రాజు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుంటే సొంతవారే విమర్శించడం సరికాదని తన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర రాజుకు కౌంటర్ ఇచ్చారు. అర్హులైన వారికి పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. శ్రీవాణి నెలలో 25 రోజులు కురుపాం నియోజకవర్గంలోనే ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

కుటుంబ విభేధాలతో వైసీపీకి గుడ్‌బై

కుటుంబ విభేధాలతో వైసీపీకి గుడ్‌బై

కోడలు పుష్పశ్రీవాణికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో కుమారుడు పరీక్షిత్‌ రాజు కూడా అండగా నిలవకపోవడంతో చేసేది లేక చంద్రశేఖర్‌ రాజు ఇవాళ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అంతే కాదు కుటుంబ విభేదాలతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రశేఖర్ రాజు ప్రకటించారు. తద్వారా కోడలుతో విభేదాల వల్లే తాను పార్టీని వీడాల్సి వస్తుందని ఆయన చెప్పినట్లయింది. అంతే కాదు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరించడం దారుణమని ఆయన అన్నారు. భయానక వాతావరణంలో చాయతీ ఎన్నికలు జరిగాయని.. పుష్పశ్రీవాణి నియంతృత్వ పోకడలకు నిరసనగా వైసీపికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రశేఖర్ రాజు ప్రకటించారు.

Read Entire Article