ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Updated: Thursday, February 18, 2021, 17:47 [IST]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు . వరుస కేసులలో చిక్కుకుంటూ నానా అగచాట్లు పడుతున్న చింతమనేని ప్రభాకర్ మీద ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు కాగా , తాజాగా టీడీపీ వైసీపీ నాయకుల ఘర్షణ నేపధ్యంలో మరో మరో కేసు నమోదైంది.

చింతమనేనిని అరెస్ట్ చేసిన ఏలూరు రూరల్ పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి, అధికారుల అనుమతులు తీసుకోకుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన కారణంగా చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు కాగా ఇక మరో కేసులో ఈ రోజు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు .పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
జగన్ కు అద్భుతమైన సలహా ఇచ్చిన స్వరూపానంద స్వామి ..ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం

టీడీపీ , వైసీపీ వర్గాల ఘర్షణ పై కేసు .. చింతమనేని అరెస్ట్ పై టీడీపీ ఫైర్
పెదవేగి మండలం బి సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారం తర్వాత వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో చింతమనేని ప్రభాకర్ లేనప్పటికీ చింతమనేనిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని అరెస్ట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుతో సంబంధం లేకుండా చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.

వరుస కేసుల్లో చిక్కుకుంటున్న చింతమనేని , మొన్ననే నిబంధనల ఉల్లంఘన కేసు
ఇటీవల పంచాయతీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చింతమనేని ప్రభాకర్ పై, కొంతమంది టీడీపీ కార్యకర్తలపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదుచేశారు . ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో చింతమనేని పై క్రైమ్ నెంబర్ 75 /2021 అండర్ సెక్షన్ 341, 188, 171- సి, 279, 336 , 143, రెడ్ విత్34, 149 , సెక్షన్ 32, ది పోలీస్ యాక్ట్ 1861 కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఇప్పుడు టీడీపీ వైసీపీ నాయకుల ఘర్షణ నేపధ్యంలో ఆయనను ఏకంగా అరెస్ట్ చేశారు .
English summary
Eluru police arrested Chintamaneni Prabhakar in a case .Prabhakar campaigned in Padavegi Mandal B Singavaram village. However, after the election campaign, there was a clash between the YCP and TDP leaders. Police have registered a case over the incident. Although Prabhakar was not present at the time of the clash, a case was registered against him and he was arrested by the police. TDP leaders are angry over Chintamaneni's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x