ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Friday, February 19, 2021, 15:18 [IST]
శ్రీనగర్: భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత నిరంతరాయంగా కొనసాగుతోన్నప్పటికీ.. వారిని నిర్మూలించడం కష్టసాధ్యంగా మారింది. ఉగ్రవాదులను మట్టుబెడుతోన్నప్పటికీ.. ప్రాణాలతో పట్టుకుని జైలుపాలు చేస్తోన్నప్పటిెకీ.. ఎక్కడో ఓ చోట వారి ఉనికి కనిపిస్తూనే వస్తోంది. టెర్రరిస్టుల జాడలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా- శ్రీనగర్ జిల్లాలో ఓ ఉగ్రవాది పట్టపగలు యథేచ్ఛగా కాల్పులకు తెగబడిన ఉదంతం కలకలం రేపుతోంది. ఆ ఉగ్రవాది కాల్పులు జరిపే దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి.
ఐపీఎల్ బంగారు బాతు: జనం అభిమానమే పెట్టుబడి: ఫ్రాంఛైజీలకు ఆదాయం ఎలా? రూపాయికి..!
लड़का पढ़ने में बहुत तेज़ था। क्रिकेट खेलने में बहुत रुचि थी । फिर BJP की सरकार आयी धारा 370 हटा दिया उसके बाद से ही ये नौजवान भटक कर थोड़े से गलत रास्ते पे चला गया है ।
इसके पिता जी गांव के हेडमास्टर थे ।
శ్రీనగర్ జిల్లాలోని బఘట్ బర్జుల్లా ప్రాంతంలో ఉదయం ఓ ఉగ్రవాది కాల్పులకు పాల్పడ్డాడు. నల్లటి దుస్తులను ధరించి, చేతిలో మెషిన్ గన్తో ఓ దుకాణంపై కాల్పులు జరిపాడు. కాల్పులకు గురైన వ్యక్తి ఒకరు అక్కడికక్కడే కుప్పకూలిపోవడం ఈ సీసీటీవీ ఫుటేజిల్లో రికార్డయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో సంఘటనా స్థలంలో ఉన్న వారు పరుగులు తీశారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యయి.

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘాతుకానికి తెగబడిన ఉగ్రవాది కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. బఘట్ బర్జుల్లా ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాది కోసం అణువణువు గాలిస్తున్నాయి. అతనికి ఆశ్రయం ఇచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నాయి. స్థానికుల సహకారం లేనిదే ఆ ఉగ్రవాది పట్టపగలు అంత ధైర్యంగా కాల్పులు జరపడానికి అవకాశం లేదని శ్రీనగర్ పోలీసులు అంచనా వేస్తోన్నారు.

English summary
Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today.
Story first published: Friday, February 19, 2021, 15:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x