జగన్‌తో జాగ్రత్త- ఒడిశాకు కేంద్రమంత్రి హెచ్చరికలు‌-కొటియాలో దూకుడుకు కౌంటర్‌ ప్లాన్‌

1 week ago 1
ARTICLE AD BOX

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల వ్యవహారం కాక రేపుతోంది. అంతర్ రాష్ట్ర వివాదం కొనసాగుతున్న కొటియా గ్రామాల్లో జగన్ సర్కార్‌ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఒడిశా సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇది మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఒడిశాకు చెందిన కొటియా గ్రామాలను కాపాడుకునేందుకు నవీన్ పట్నాయక్ సర్కారుకు ఆయన ఓ కీలక సూచన కూడా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఏపీ-ఒడిశా మధ్య కొటియా పంచాయతీ

ఏపీ-ఒడిశా మధ్య కొటియా పంచాయతీ

ఏపీలోని విజయనగరం జిల్లాకూ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు మధ్య ఉన్న కొటియా గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయన్న దానిపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కేసులు దాఖలైనా స్పష్టమైన తీర్పు మాత్రం రాలేదు. దీంతో ఇప్పటికీ ఆ వివాదం అలాగే కొనసాగుతోంది. అయితే ఒడిశా ఈ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేయకపోవడం, ఇతరత్రా కార్యక్రమాలకు కూడా ఆసక్తి చూపకపోవడంతో ఏపీలో ప్రభుత్వాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ సాయంతో అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించారు. దీనిపై ఒడిశా సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు సజావుగా జరిగిపోతున్నాయి.

ఒడిశాలో కాక రేపుతున్న కొటియా వ్యవహారం

ఒడిశాలో కాక రేపుతున్న కొటియా వ్యవహారం

ఏపీ సరిహద్దుల్లో ఉన్న తమ రాష్ట్రానికి చెందిన కొటియా గ్రామాలను కాపాడుకోవడంలో నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ అక్కడి విపక్ష బీజేపీ విమర్శలకు దిగుతోంది. కొటియా గ్రామాల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ నవీన్‌ను టార్గెట్‌ చేస్తోంది. విపక్షాల ఒత్తిడితో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన నవీన్ సర్కారుకు అక్కడా ఎదురుదెబ్బ తప్పలేదు. ఎన్నికల వరకూ ఓకే చెప్పిన సుప్రీంకోర్టు.. కొటియా గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయన్నది ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా తేల్చుకోవాలని చెప్పి వదిలేసింది.

జగన్‌తో జాగ్రత్త అన్న కేంద్రమంత్రి

జగన్‌తో జాగ్రత్త అన్న కేంద్రమంత్రి

కొటియా గ్రామాల్లో జగన్ సర్కారు దూకుడుపై ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్ రాష్ట్ర వివాద పరిష్కారం కోసం నవీన్ సర్కారు తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్ధితి మరింత దిగజారడం ఖాయమని బీజేడీ సర్కారును ఆయన హెచ్చరించారు. సరిహద్దు గ్రామాల వివాద పరిష్కానికి ఒడిశా సర్కారు చట్టపరంగా ముందుకెళ్తున్నప్పటికీ, దానికి నిర్ణయాత్మక ముగింపుకు తీసుకెళ్లాలని ఆయన సీఎం నవీన్‌కు సూచించారు. ఏపీ సర్కారు దూకుడుపై సకాలంలో చర్యలు తీసుకోకపోతే దారుణమైన పరిస్థితులు తప్పవని ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన హెచ్చరికలు సంచలనం రేపాయి.

 కొటియాలో జగన్‌ సర్కారుకు కౌంటర్‌ ప్లాన్‌ ఇదే

కొటియాలో జగన్‌ సర్కారుకు కౌంటర్‌ ప్లాన్‌ ఇదే

ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో వివాదాస్పద కొటియా గ్రామాలను కాపాడుకునేందుకు నవీన్ సర్కారుకు ధర్మేంద్రప్రధాన్‌ ఓ కీలక సూచన కూడా చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా సరిహద్దు గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఒడిశాకు చెందిన ప్రధాన్ అన్నారు. మన రాష్ట్ర సరిహద్దును కాపాడటం, సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న మా సోదరులు, సోదరీమణులు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క అన్ని ప్రయోజనాలను పొందేలా చూడటం మా బాధ్యత అని ప్రధాన్ అన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.

Read Entire Article