చంద్రబాబు సిగ్గుపడాలి, కుప్పం ఫలితాల తర్వాత రాజకీయాల నుండి తప్పుకోవాలి : మంత్రి వెల్లంపల్లి

2 weeks ago 2
ARTICLE AD BOX

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసిపి 89 స్థానాలకు, 75 స్థానాలను గెలిచిందని పేర్కొన్న మంత్రి ఈ ఫలితాల తర్వాత చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసిన చంద్రబాబు సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.

 మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది

నేడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్క పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే కాదు ముందు ముందు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారని, చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన సిద్ధాంతం ఏమిటో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన వెల్లంపల్లి

పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన వెల్లంపల్లి

కొద్దిరోజులు కమ్యూనిస్టులు, కొంతకాలం టిడిపి, ఇప్పుడు బీజేపీతో కలిసి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పనికిమాలిన కళ్యాణ్ గా మారారని వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్.

ఇక తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయని, వారిలో వారికే పడదని వ్యాఖ్యానించిన వెల్లంపల్లి శ్రీనివాస్, వారిలో వారు ఘర్షణలు పడుతుంటే ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. టిడిపి హేమాహేమీలు ఉన్న ప్రాంతాల్లో కూడా వైసిపి ఆధిపత్యం సాధించింది అన్నారు.

విజయవాడ కార్పోరేషన్ లో వైసీపీ జెండా ఎగురుతుంది

విజయవాడ కార్పోరేషన్ లో వైసీపీ జెండా ఎగురుతుంది

టెక్కలి, కుప్పం, తుని, మైలవరం వంటి స్థానాలలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కనబరిచిందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రానున్న కార్పోరేషన్ ఎన్నికల్లో 22 స్థానాలకు 22 స్థానాలు గెలుస్తామని, కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగురుతుంది అని, మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన అన్నారు.

కుప్పంలో ఓటమిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తున్న మంత్రి సలహా

కుప్పంలో ఓటమిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తున్న మంత్రి సలహా

గాలివాటం లో ఎంపీ కేశినేని నాని గెలుపొందారు అని నియోజకవర్గం గురించి ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ చేసిన పనులు ఏమీ లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు

ఆదరించరని పేర్కొన్న మంత్రి కుప్పంలో టీడీపీ ఓటమి చెందిందని చంద్రబాబును ఎద్దేవా చేసి ఇక రాజకీయాల నుండి తప్పుకోమని సలహా ఇచ్చారు .

Read Entire Article