ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Monday, February 15, 2021, 21:06 [IST]
గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చూపించిన అర్థానికి పెనుదుమారం రేగింది. గాడ్ బ్లెస్ యూ అనే వాక్యానికి హిందీలో అనువాదం అస్సలాం అలైకుమ్ అర్థం వస్తుందని చూపించింది. నిజానికి ఆ వ్యాక్యానికి హిందీలో భగవాన్ అప్కా బాల కరే అని చూపించాలి.. కానీ ఈ ఎర్రర్‌ను ట్విట్టర్ పసిగట్టేసింది. దానిని నెటిజన్లు ట్వీట్ చేస్తుండటంతో వెంటనే గూగుల్ తప్పు సరిదిద్దుకుంది.
ట్విట్టర్ ఫీడ్ బ్యాక్ పంపిన తర్వాత గూగుల్ సరిచేసిందని.. ఐకమత్యాన్ని కాపాడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముందు వచ్చిన అర్థాన్ని మార్చిన తర్వాతి పదాన్ని పోస్టు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మెషీన్ ట్రాన్స్లేషన్ కోసం న్యూరల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది. గూగుల్ ట్రాన్స్ లేట్ మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిస్టమ్‌గా మారిపోయింది. మల్టిపుల్ లాంగ్వేజెస్‌కు ప్రాంతీయ భాషల్లో అర్థం చెప్పేందుకు ఆటోమేటిక్‌గా చెప్పేలా ప్రిపేర్ చేసేశారు.

గూగుల్ ట్రాన్స్ లేటర్ వచ్చిన తొలినాళ్లలో ఇలా ఉండేది కాదు. స్టాటిక్ ట్రాన్స్ లేషన్ మాత్రమే అందుబాటులో ఉండేది. అందులో వ్యాక్యాలను ముందుగా ఉన్న వాటితో పోల్చుకుని అవుట్‌పుట్ ఇచ్చేది. ఆ పదాలు అంతగా కచ్చితంగా ఉండటం లేదని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను వాడటం మొదలుపెట్టారు. ఇలా వాడిన అర్థమే మారుతుంది. హిందీ పదం స్వరూపమే మారింది. దీనిని సోషల్ మీడియా ట్విట్టర్ గుర్తించింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది.
Google translates ‘God bless you’ to ‘Assalam Alaikum’ in Hindi, Which Is Wrong!!! pic.twitter.com/wLbLkre3mZ
— Mohd Fasiuddin (@MohdFasiuddin10) February 14, 2021English summary
google translation of god bless you in hindi assalam alaikum showing
Story first published: Monday, February 15, 2021, 21:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x