ఏపీలో ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల- మార్చి 15న పోలింగ్- అన్నీ వైసీపీకే

1 week ago 2
ARTICLE AD BOX

ఏపీ శాసనమండలిలో పలువురు సభ్యుల రాజీనామాలు, పదవీకాలం ముగింపుతో ఖాళీ అయిన ఆరు స్ధానాల ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 15న ఎన్నికలు ఉంటాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చిలో మున్సిపల్ పోరుకు కూడా షెడ్యూల్‌ విడుదలైంది. ఈ సమయంలో శాసనమండలిలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్ధానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికలకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఆ రోజు నుంచే నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత మిగతా ప్రక్రియ కూడా సాగనుంది.

 ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

తాజాగా సీఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఆరు ఎమ్మెల్సీ సీట్లకు జరిగే ఎన్నికల కోసం మార్చి 4వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 8 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 15న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. నామినేషన్లు ఏకగ్రీవమైతే మాత్రం పోలింగ్ ఉండదు.

మండలిలో ఖాళీ స్ధానాలివే..

మండలిలో ఖాళీ స్ధానాలివే..

ఏపీ శాసనమండలిలో వివిధ సీట్లతో ఆరు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే రెండు స్ధానాలు ఖాళీ కాగా.. వచ్చే నెలలో మరో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. మరో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. వీరు కాకుండా మహ్మద్ ఇక్బాల్‌, తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ ఆరు స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

వైసీపీ ఖాతాలోకే ఎమ్మెల్సీ సీట్లు

వైసీపీ ఖాతాలోకే ఎమ్మెల్సీ సీట్లు

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు సీట్లను అధికార వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీకి 151 సభ్యుల బలం ఉంది. టీడీపీకి 23 సీట్ల బలం ఉన్నా... నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరంతా టీడీపీకి మద్దతిచ్చినా ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం కష్టమే. అలాగే ఈ ఎన్నికల తర్వాత మండలిలో టీడీపీ బలం కూడా ఆ మేరకు తగ్గిపోనుంది. ఇప్పటికే మండలిలో తమకున్నబలంతో టీడీపీ ... అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కూడా కీలకంగా మారాయి.

Read Entire Article