ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Tuesday, April 9, 2019, 16:25 [IST]
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ కొత్తగా కోటవురట్ల,ఎస్ రాయవరం మండలాలు పాయకరావుపేట నియోజకవర్గంలో చేరాయి. టిడిపి ఆవిర్భావం తరువాత ఇక్కడ వరుసగా ఆరు సార్లు టిడిపి గెలిచింది. టిడిపి నుండి పోటీ చేసిన నూకరాజు మూడు సార్ల గెలుపొందారు. మరో సభ్యుడు చెంగల వెంకట్రావు రెండు సార్లు గెలవగా..మరో రెండు సార్లు ఓడిపోయారు. 1952 వరకు ఈ నియోజకవర్గం జనరల్ గా ఉండేది. అప్పుడు సాగి సూర్యనారాయణ రాజు గెలుపొందారు. ఆ తరువాత నర్సీపట్నం నుండి మరో మూడు సార్లు గెలిచారు.
13 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో టిడిపి ఏడు సార్లు, కాంగ్రెస్ నాలుగు సార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి . 2009 లో ఇక్కడ గెలిచిన జి బాబురావు వైయస్ మరణం తరువాత రాజకీయ పరిణామాల్లో జగన్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, ఆయన పై అనర్హత వేటు పడింది. దీని కారణంగా జరిగిన 2012 లో ఉప ఎన్నికల్లో తిరిగి టిడిపి అభ్యర్ది చెంగల వెం కట్రావు పై మరోసారి గొల్ల బాబురావు గెలిచారు. ఇక, 2014 ఎన్నికల్లో ఇక్కడ సమీకరణాల్లో మార్పులు జరిగాయి. టిడిపి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెంగల వుంకట్రావు ఎన్నికల ముందు వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో అక్కడ మొత్తంగా 222875 ఓట్లు ఉండగా, అందులో 178610 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన అనితకు 86355 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన చెంగల వెంకట్రావు కు 83527 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన అనిత 2828 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
English summary
Andhra Pradesh Assembly Election 2019: Know detailed information on Payakaraopet Assembly Constituency of Andhra Pradesh. Get information about election equations, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Payakaraopet Vidhan Sabha seat.
Story first published: Tuesday, April 9, 2019, 16:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x