ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

1 year ago 2
ARTICLE AD BOX

వేగవంతమైన అలర్ట్స్ కోసం

వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  

వేగవంతమైన అలర్ట్స్ కోసం

నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

bredcrumb

| Published: Monday, April 8, 2019, 20:08 [IST]

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఉయ్యూరు ను ర‌ద్దు చేస్తూ పామ‌ర్రు కొత్త‌గా ఏర్పాటు అయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయింది. తోట్ల‌వ‌ల్లూరు, ప‌మిడిముక్క‌ల‌, మొవ్వ‌, పెద‌పారుపూడి, పామ ర్రు మండ‌లాల‌తో ఈ సెగ్మెట్ ఏర్పాటైంది. 2009, 2014 లో ఇక్క‌డ రెండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. గ‌తంలో ఉన్న నిడు మోలు నియోజ‌క‌వ‌ర్గం 2009 లో డీలిమిటేష‌న్‌లో భాగంగా ర‌ద్దు అయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం సిపియం కు కంచుకోట‌గా ని లిచింది. ఇక్క‌డ నుండి సీపియం నేత పాటూరి రామ‌య్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నేత క‌నుమూరి సోమేశ్వ‌ర రావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్క‌డి నుండే గెలుపొందారు. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆ పార్టీ కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే గెలిచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో..

2009 లో రద్దు అయిన నిడుమోలు నియోజ‌క‌వ‌ర్గంలో 11 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో ఆరు సార్లు సిపియం, ఒక సారి సిపిఐ, రెండు సార్లు టిడిపి, రెండు సార్లు కాంగ్రెస్ గెలుపొందాయి. ఇక‌, పామ‌ర్రు నియోజ‌క‌వర్గంలో 2009 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి ఉప్పులేటి కల్ప‌న పై కాంగ్ర‌స్ అభ్య‌ర్ది డివై దాస్ గెలుపొందారు. ప్ర‌జారాజ్యం సైతం ఇక్క‌డి నుండి బ‌రిలో దిగింది. ఇక‌, 2009 లో టిడిపి నుండి పోటీ చేసిన ఉప్పులేటి క‌ల్ప‌న ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసిపి లోకి చేరి 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్దిగా పోటీ చేసారు.

 All about Pamarru Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..

2014 ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 171907 ఓట్లు ఉండ‌గా, అందులో 150981 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన కల్ప‌న కు 69456 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన వ‌ర్ల రామ‌య్య‌కు 68477 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది క‌ల్ప‌న 1069 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పులేటి క‌ల్ప‌న ఆ త‌రువాత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టిడిపి లోకి ఫిరాయించారు. టిడిపి నుండి పోటీ చేసి ఓడిన వ‌ర్ల రామ‌య్య‌కు ఆర్టీసి ఛైర్మ‌న్ గా నామినేటెడ్ పోస్టు ద‌క్కింది.

English summary

Andhra Pradesh Assembly Election 2019: Know detailed information on Pamarru Assembly Constituency of Andhra Pradesh. Get information about election equations, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Pamarru ,Vidhan Sabha seat.

Story first published: Monday, April 8, 2019, 20:08 [IST]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి

Enable

x

Read Entire Article