ARTICLE AD BOX
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Monday, April 8, 2019, 19:55 [IST]
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందివాడ, గుడ్లవల్లేరు మండలాలను ఈ నియోజకవర్గంలో విలీనం చేసా రు. అదే విధంగా గతంలో ఇక్కడ ఉన్న పామర్రు, పెదపారుపూడి మండలాలు పామర్రు నియోజకవర్గంలో కలిపారు. ప్ర ముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరం నియోజకవర్గం లో మూడు సార్లు గెలిచారు. 1967 లో గెలిచిన వెలివెల సీతారామయ్య ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రముఖ నేత కాకాని వెంకటరత్నం గెలుపొం దారు. కాకాని ఉయ్యూరు లో మూడు సార్లు గెలిచారు. ముసునూరు బోస్ ఒకసారి టిడిపి నుండి..మరోసారి కాంగ్రెస్ నుండి గెలిచారు. 1994 లో ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా గెలిచిన గద్దె రామ్మోహన్ విజయవాడ లోక్సభ కు ఎన్నికయ్యారు. కాకాని వెంకటరత్నం గతంలో కాసు, పి.వి మంత్రివర్గాల్లో పని చేసారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి అయి దు సార్లు, సిపిఐ రెండు సార్లు, సిపియం ఒకసారి, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్దులు విజయం సాధించారు. ఇక్కడ నుం డి 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా గెలిచిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గెలిచారు. ఆయనే తిరిగి కాంగ్రెస్ లో చేరి టిడిపి అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే దాసరి బాల వర్ధనరావు చేతిలో 2009 లో ఓడిపోయారు. ఆ తరువాత 2014 నాటికి ఇక్కడి రాజ కీయ సమీకరణాల్లో మార్పు కనిపించింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో మొత్తంగా ఇక్కడ 230634 ఓట్లు ఉండగా, అందులో 198444 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వల్లభనేని వంశీ కి 99163 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన డాక్టర్ రామచంద్రరావు కు 89616 ఓట్లు వచ్చాయి. ఇక, టిడిపి నుండి పోటీ చే సిన వల్లభనేని వంశీ 9548 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
English summary
Andhra Pradesh Assembly Election 2019: Know detailed information on Gannavaram Assembly Constituency of Andhra Pradesh. Get information about election equations, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Gannavaram Vidhan Sabha seat.
Story first published: Monday, April 8, 2019, 19:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x