అనుమానంతో దారుణం... ఆమెతో మాట్లాడుతుండగా హఠాత్తుగా దాడి.. ఇల్లందులో హైడ్రామా...

1 week ago 13
ARTICLE AD BOX

ఓ హోంగార్డుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన హోంగార్డ్ కుటుంబ సభ్యులు ఆమెను తాడుతో ఇంటి ఎదుట కిటికీకి కట్టేశారు. అతనికి,తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా తనపై దాడి చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఈ గొడవ సద్దుమణిగింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో నరేష్ అనే వ్యక్తి హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానిక ఆర్&ఆర్ కాలనీలో కుటుంబంతో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నరేష్‌ ఆదివారం(ఏప్రిల్ 4) మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఏదో మాట్లాడుతుండగా.. హఠాత్తుగా నరేష్ తల్లి,బంధువులు అక్కడికి వచ్చారు. అంతే,ఆ మరుక్షణం ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. నరేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతన్ని పక్కకు తోసేసి మరీ దాడి చేశారు.

తాడుతో కిటికీకి కట్టేశారు...

తాడుతో కిటికీకి కట్టేశారు...

నరేష్,ఆ మహిళ చెబుతున్న మాటలు వినిపించుకోకుండా ఆగ్రహావేశంతో దాడికి పాల్పడ్డారు. ఆపై ఆ మహిళను ఆమె ఇంటి ఎదుటే తాడుతో కిటికీకి కట్టేశారు. నరేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని అతని వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తోందని స్థానికులతో అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెను దుర్భాషలాడారు. స్థానికులు ఎవరూ జోక్యం చేసుకోకపోవడంతో బాధితురాలు నిస్సహాయురాలిగా మిగిలిపోయింది.

 బాధితురాలు

అతనితో ఏ సంబంధం లేదు : బాధితురాలు

నరేష్‌కు,తనకు ఎటువంటి సంబంధం లేదని బాధితురాలు వాపోయింది. ఒంటరి మహిళనైన తాను స్థానికంగా ఓ షాపులో పనిచేసుకుంటున్నట్లు తెలిపింది. నరేష్ తన నుంచి డబ్బులు తీసుకుని బయటి వ్యక్తులకు అప్పులు ఇచ్చేవాడని చెప్పింది. ఆదివారం కూడా డబ్బుల కోసమే తన ఇంటికి వచ్చాడని పేర్కొంది. ఇదే క్రమంలో అతని కుటుంబ సభ్యులు అకారణంగా తన ఇంటిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

గత కొన్నిరోజులుగా నరేష్ ఇంటికి సరిగా రాకపోవడంతో అతను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కొంతకాలంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం నరేష్.. ఆ మహిళ ఇంట్లో ఉన్నట్లు తెలియడంతో తమ అనుమానమే నిజమనుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకుని ఆమెపై దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ కుటుంబ సభ్యులను,ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

Read Entire Article